ఖమ్మం: కోటి విలువైన గంజాయి స్వాధీనం

9చూసినవారు
ఖమ్మం: కోటి విలువైన గంజాయి స్వాధీనం
తెలంగాణ నార్కోటిక్స్ పోలీసు విభాగం, ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని కొణిజర్ల పోలీసులతో కలిసి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సాగుతున్న భారీ గంజాయి స్మగ్లింగ్ నెట్వర్క్ను బట్టబయలు చేసింది. ఈ సంయుక్త ఆపరేషన్లో సుమారు కోటి రూపాయల విలువైన 200 కిలోల 104 ప్యాకెట్ల ఎండు గంజాయిని అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఐదుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారి, సప్లయర్ పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్