ఖమ్మం: మాస్టర్ ప్లాన్ కు త్వరలో ఆమోదం

66చూసినవారు
ఖమ్మం: మాస్టర్ ప్లాన్ కు త్వరలో ఆమోదం
ఖమ్మం నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాను త్వరలోనే ప్రభుత్వంతో ఆమోదింపజేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం 20వ డివిజన్ లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెవెన్యూ, భూసంబంధిత సమస్యలను అదనపు కలెక్టర్, కేఎంసీ కమిషనర్ సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుండగా, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించాక ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.