అభివృద్ధి విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీపడరని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. బుధవారం ఖమ్మం 46వ డివిజన్ రామాలయం విధిలో రూ. 11 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడమే మంత్రి తుమ్మల లక్ష్యమని చెప్పారు. నగరంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వైష్ణవి పాల్గొన్నారు.