ఖమ్మం 46వ డివిజన్‌లో సుమారు రూ. 29.50 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం పునుకొల్లు నీరజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్థానిక జూబ్లీపుర, సారథి నగర్ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. అభివృద్ధి విషయంలో మంత్రి తుమ్మల ఎన్ని నిధులైనా ఇస్తారని, అయితే వాటిని సవ్యంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆమె అన్నారు.