గురువారం ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ 41వ డివిజన్ చెరువు బజార్ ఆంజనేయస్వామి ఆలయం వెనుక రూ. 30 లక్షలు, మమత హాస్పటల్ రోడ్ లోని మజీద్ రోడ్ లో రూ. 8 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ. 38 లక్షలతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్ తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో డివిజన్లకు అభివృద్ధి పనులు కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.