మున్నేరు వరద నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి బఫర్ జోన్, ఎఫ్టీఎల్, డిజైన్, గత రికార్డుల ప్రకారం ప్రవాహానికి ఎంత ఎత్తులో నిర్మించాలి, తదితర వివరాలపై ఆరా తీశారు.