ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడువును నవంబర్ 13 వరకు పొడిగిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. శంకర్ బుధవారం తెలిపారు. అనస్థీషియా మరియు మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ విభాగాలలో చెరో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, సంబంధిత ధృవపత్రాలతో కూడిన దరఖాస్తు ప్రతిని కళాశాలలో సమర్పించాలి. బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.