ప్రతీ నెల 12న హెబ్రీటీ వినియోగదారులతో సమావేశం నిర్వహిస్తామని ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. జిల్లాలోని గ్రానైట్ ఫ్యాక్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు విద్యుత్ సమస్యలపై బుధవారం ఎస్ఈని కలిసి విద్యుత్ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని తెలిపారు.