జిల్లాలోని మిల్లర్లు సీఎంఆర్ రైస్ ను సకాలంలో అప్పగించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. గత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పెండింగ్ ఉన్న బియ్యం అప్పగించడమే కాక ఈ ఏడాది యాసంగి సీఎంఆర్ అందజేయడం మొదలుపెట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ డీసీఎస్ఓ చందన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, తదితరులు ఉన్నారు.