ఖమ్మం: రైతులకు మంత్రి భరోసా

7చూసినవారు
ఖమ్మం: రైతులకు మంత్రి భరోసా
తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, తేమ కలిగిన పసుపును కూడా కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రైతులను ఇబ్బంది పెడితే మార్కెట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా పసుపు వస్తుందని, 1,500 టార్పాలిన్ల పంపిణీ కోసం బిడ్డింగ్ పూర్తయిందని తెలిపారు. ప్రభుత్వం పసుపు రైతులకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్