ఖమ్మం: మున్నేరు వరద ఉద్ధృతిని పరిశీలించిన మంత్రి

5చూసినవారు
గురువారం ఖమ్మంలో మున్నేరు వరద ఉద్ధృతిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. మున్నేరు 26 అడుగులకు చేరిందని, ఇక పెరిగే అవకాశం లేదని, ఎగువ నుంచి వరద తగ్గుతోందని తెలిపారు. మున్నేరు కరకట్టలు పూర్తయితే ఖమ్మం నగరానికి డోకా ఉండదని, రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి, పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్