ఖమ్మం నయాబజార్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీసు కమీషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదను ప్రతి అరగంటకు ఒకసారి పర్యవేక్షిస్తూ, మున్నేరు నది పరివాహక ప్రాంతంలో ప్రజల ప్రాణ నష్టాన్ని నివారించిన జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. వరద బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.