ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న 400 మీటర్ల అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పెండింగ్ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి, జాతీయ స్థాయి పోటీలకు ట్రాక్ ను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఖమ్మం అథ్లెట్ల చిరకాల స్వప్నం నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ సునీల్ రెడ్డి, మేయర్ నీరజ కూడా పాల్గొన్నారు.