ఖమ్మం రమణగుట్టలోని దొరన్నకాలనీలో సిసి రోడ్లు, స్ట్రోమ్ వాటర్ లైన్ నిర్మాణానికి శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అంతకముందు ప్రకాష్ నగర్ లో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దొరన్న కాలనీలో అభివృద్ధి పనులకు కావాల్సిన మేర నిధులు కేటాయిస్తామని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.