ఖమ్మం త్రీటౌన్ 32వ డివిజన్ లోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.