మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం వీడీవోస్ కాలనీలో ఎన్టీఆర్ పార్క్ ను ప్రారంభిస్తారు. సోమవారం రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో వ్యవసాయ స్ప్రేయర్ డ్రోన్ల అవగాహన సదస్సులో పాల్గొని, రాములు తండాలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. మంగళవారం రఘునాథపాలెం మండలం వీ. వీ. పాలెంలో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ తో పాటు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. పథకం డెలివరీ పాయింట్ వద్ద రైతులతో సమావేశమవుతారు.