ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఖమ్మంలో పర్యటించి, సారథినగర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పంపింగ్ వెల్ రోడ్, గుట్టల బజార్, నిజాంపేట్, బ్యాంక్ కాలనీ, వేణుగోపాల్ నగర్, రాపర్తి నగర్ ప్రాంతాల్లోనూ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. లకారం పార్క్ సమీపంలో పెట్ పార్క్, కొత్తగూడెం, అల్లీపురం ప్రాంతాల్లో సీసీ డ్రెయిన్లు, డ్రింక్ ఫ్రం ట్యాప్ పథకాన్ని కూడా మంత్రి ప్రారంభించనున్నారు. ఈ పర్యటన ద్వారా ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.