రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఖానాపురం ప్రాంతంలో 6, 7వ డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు కోరారు.