ఖమ్మంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ నిరసన తెలిపారు. సమావేశంపై తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఛైర్మన్ ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని ఆయన నిలదీశారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు సమాచారం అందకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని ఛైర్మన్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ తన నిరసనను విరమించుకున్నారు.