ఖమ్మం: ఎమ్మెల్సీ విజయశాంతి చిత్రపటానికి పాలాభిషేకం

1చూసినవారు
ఖమ్మం: ఎమ్మెల్సీ విజయశాంతి చిత్రపటానికి పాలాభిషేకం
ఖమ్మం మయూర్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (రిజిస్టర్డ్) ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ఆమె మాట్లాడినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే. వీ. కృష్ణారావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు జరిగిన అన్యాయం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ జరుగుతోందని అన్నారు.

ట్యాగ్స్ :