ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం సర్పంచి స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆసక్తి నెలకొంది. గ్రామంలోని 470 ఓట్లలో ఒకే ఎస్సీ కుటుంబం ఉండగా, ఆ కుటుంబానికి చెందిన కాంపల్లి కోటమ్మ మాత్రమే పోటీలో ఉన్నారు. నాలుగో వార్డు ఎస్సీ జనరల్కు కేటాయించడంతో ఆమె కుమారుడు దావీదు వార్డు మెంబర్గా ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.