గురు పూర్ణిమ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గురువారం ఖమ్మం నగరంలోని పలు సాయిబాబా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రఘునాథపాలెంలో కొలువైన సాయిబాబా ఆలయాన్ని సందర్శించి భక్తి ప్రపత్తులతో పూలు, పంచామృతంతో సాయిబాబాకు అభిషేకం చేశారు. ఆతర్వాత వీడియోస్ కాలనీ, మామిళ్లగూడెంలో షిర్డీ సాయిబాబా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల కమిటీ సభ్యులు ఎంపీని శాలువాలతో సత్కరించారు.