ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు.. బరిలో 415 మంది

2చూసినవారు
ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు.. బరిలో 415 మంది
ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికల బరిలో మొత్తం 415 మంది అభ్యర్థులు నిలిచారు. ఎదులాపురం మున్సిపాలిటీలో అత్యధికంగా 109 మంది, వైరా 84, మధిర 80, సత్తుపల్లి 72, కల్లూరులో 70 మంది పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 46 మంది స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి 41 మంది అభ్యర్థులు ఉన్నారు. 372 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తుది జాబితా ఖరారు కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకురావచ్చని భావిస్తున్నారు.