ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిన్నటి వరకు మొత్తం 316 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎదులాపురం, వైరా, సత్తుపల్లి, కల్లూరు, మధిర నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరించారు. పార్టీల వారీగా చూస్తే, బీజేపీ 35, సీపీఎం 23, కాంగ్రెస్ 114, బీఆర్ఎస్ 124, టీడీపీ 2, గుర్తింపు పొందిన పార్టీలు 8, స్వతంత్రులు 10 మంది నామినేషన్లు సమర్పించారు. నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.