ఖమ్మం: మున్నేరు ఉగ్రరూపం.. 25 అడుగులు చేరిన నీటిమట్టం

1724చూసినవారు
ఖమ్మం జిల్లాలో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చి ప్రస్తుతం 25 అడుగుల మేర ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గత ఏడాదిలాగే ఇళ్లల్లోకి నీరు చేరి వస్తువులు పాడవుతాయేమోనన్న భయంతో కాలనీవాసులు ప్రైవేటు వాహనాల ద్వారా తమ సామాన్లను తరలించుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా వరుసగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుండడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్