బక్రీద్ పండుగ సందర్భంగా పశువులను తరలించేవారు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వార్తలు, వదంతులు నమ్మవద్దని, అలాంటివి వ్యాప్తి చేసే వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు లేదా సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇతర సమస్యలు ఉంటే కమాండ్ కంట్రోల్ నంబర్ 8712659111కు సంప్రదించాలని తెలిపారు.