జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 14న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ తెలిపారు. మొత్తంగా 13 బెంచ్లలు ఏర్పాటు చేస్తుండగా.. రాజీపడదగిన అన్ని సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు ప్రమాదాలు, వివాహ సంబంధిత, బ్యాంక్ కేసులను పరిష్కరించుకోవచ్చునని వెల్లడించారు. పోలీస్, బీమా కంపెనీలు బాధ్యులతో చర్చించి రాజీపడదగిన కేసులు గుర్తించామని తెలిపారు.