భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా బుధవారం ఖమ్మం జిల్లా క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రగతికి, ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, ఎమ్మెల్యే మట్టా రాగమయి, నాయకులు పాల్గొన్నారు.