ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 31న ఆదివారం సాయంత్రం 6 గంటలకు నెల నెలా వెన్నెల 106వ కార్యక్రమం జరగనుంది. అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ(ఆర్క్స్) ఆధ్వర్యంలో, ఖమ్మం కళా పరిషత్, ప్రజా నాట్యమండలి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 'అందరూ మంచివారే. కానీ' అనే నాటిక ప్రదర్శించబడుతుంది. కళాకారులు, కళాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.