ఖమ్మం: నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

3చూసినవారు
ఖమ్మం: నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ఖమ్మం కార్పెంటర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం స్థానిక సంభానినగర్ మినీ ఫంక్షన్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేసింది. నూతన కమిటీ అధ్యక్షుడు పాలడుగు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పాలకి వెంకటాచారి, కోశాధికారి రామడుగు శివ నాగేశ్వరావుల చేత ప్రమాణ స్వీకారం చేయించి ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్లను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, కార్పెంటర్ అసోసియేషన్ బాధ్యులతో కలిసి ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్