ఖమ్మం నగరంలోని
ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గురువారం
బీజేపీ ఆధ్వర్యంలో
ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా
ఎన్టీఆర్ విగ్రహానికి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపజేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.