ఖమ్మం: ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శి

5చూసినవారు
దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యావత్ దేశానికి మార్గదర్శిగా నిలిచాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. ఆదివారం ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ తెచ్చిన రూ. 2కే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల వంటి పథకాలు అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలిచాయని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్