శుక్రవారం తనికెళ్ల గ్రామంలో వైరా నుండి ఖమ్మం వైపు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్, ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొని రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్యాంకర్ బోల్తా పడి ఆయిల్ కింద పోతుండటంతో, సంఘటనా స్థలంలో రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో స్థానికులు వాటర్ క్యాన్లు, బకెట్లు, బిందెలతో ఆయిల్ ను తీసుకెళ్లారు. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు.