ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మొక్కజొన్న తీసుకొచ్చిన వాహనాలతో రద్దీ నెలకొంది. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను మార్కెట్లో నూతనంగా నిర్మిస్తున్న షెడ్లలో నిల్వ చేస్తున్నారు. మిర్యాలగూడ, ఏపీలోని జగ్గయ్యపేట గోదాములు నిండిపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి రెండు రోజులుగా వాహనాలు వస్తుండడంతో బుధవారం మరింత రద్దీ ఏర్పడింది. మార్కెట్ ఆవరణతో పాటు సమీప రహదారుల వెంట వాహనాలు బారులుదీరాయి.