ఖమ్మం: మిగిలిన వారికి కూడా తక్షణమే పట్టాలు ఇవ్వాలి

5చూసినవారు
ఖమ్మం జిల్లా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం వెలుగుమట్ల నిర్వాసితులతో ఒక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర సభ్యులు అవునూరి మధు మాట్లాడుతూ, మొత్తం 62.07 ఎకరాల భూదాన్ భూముల్లో వెంటనే భూదాన్ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 311 మంది నిర్వాసితులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, మిగిలిన వారికి కూడా తక్షణమే పట్టాలు అందించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్