పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని పిడీఎస్యు జిల్లా అధ్యక్షుడు జీ. మస్తాన్ కలెక్టర్ ను కోరారు. ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఆయన వినతిపత్రం అందజేశారు. అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, గిరిజన అభివృద్ధి శాఖ ఏటీడీవో సత్యవతి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.