ఖమ్మం జిల్లాలో అనుమతులు లేని నారాయణ విద్యాసంస్థలకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తున్నారని పిడిఎస్యూ డివిజన్ అధ్యక్షులు సాధిక్, నగర అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ ఆరోపించారు. సోమవారం డీఐఈవో రవిబాబుకి వినతిపత్రం అందజేశారు. నారాయణ కాలేజీలో విద్యార్థులపై అధ్యాపకుల అసభ్యకర ప్రవర్తన, అనుమతులు లేకుండానే తల్లిదండ్రులను మోసం చేసి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో దోపిడీ చేస్తున్నారని వారు వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.