ఖమ్మం: లోక్ అదాలత్ ద్వారా శాశ్వత పరిష్కారం

77చూసినవారు
ఖమ్మం: లోక్ అదాలత్ ద్వారా శాశ్వత పరిష్కారం
లోక్ అదాలత్ లో కేసును ఇరుపక్షాలు రాజీ చేసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అంతిమ తీర్పుపై ఎటువంటి అప్పీల్ కు అవకాశం వుండదని జిల్లా జడ్జీ జి. రాజగోపాల్ తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3500 సివిల్, క్రిమినల్ కేసులను రాజీ చేసామని, 62 మోటార్ వెహికల్ ప్రమాద కేసులలో రాజీ ద్వారా రూ. 2. 80కోట్ల పరిహారం ఇప్పించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్