రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లో శనివారం మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలనపై రెండేళ్లలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గణనీయంగా గెలిచారని తెలిపారు.