ఖమ్మం: గాలి దుమారానికి పడిపోయిన పోలీస్ బూత్

0చూసినవారు
ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద గాలి దుమారానికి పోలీస్ బూత్ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రధాన కూడలిలో బూత్ కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎప్పుడు ఏ వాహనం దానికి ఢీకొంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పడిపోయిన పోలీస్ బూత్ ను తొలగించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్