పోలీస్ బాస్ డీజీపీ ఆనంద్ రెండు రోజుల పర్యటనకు ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. సోమవారం భద్రాద్రి రామాలయం దర్శించుకున్న తర్వాత మణుగూరు, పాల్వంచలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని కొత్తగూడెంలో జిల్లా క్రైం రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. రాత్రికి ఖమ్మంలో బస చేసి మంగళవారం ఉదయం ఖమ్మం పోలీసుల పనితీరుపై సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడతారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీస్ అధికారులు హై అలర్ట్ అయ్యారు.