ఖమ్మం నగరంలోని బుర్హాన్ పురం ఉపకేంద్రం పరిధిలో 11 కేవీ రామాలయం ఫీడర్ మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, అలాగే 11 కేవీ నెహ్రూనగర్ ఫీడర్ మరమ్మతుల కారణంగా మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని టౌన్-1 ఏడీఈ సీహెచ్. నాగార్జున తెలిపారు. మామిళ్లగూడెం, రామాలయం సెంటర్, గాయత్రిభవన్, రాపర్తినగర్, బైపాస్ రోడ్, డీఆర్డీఏ, రవీంధ్రనాథ్ ఠాకూర్ రోడ్, బుర్హాన్పురం, నెహ్రూనగర్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి. వినియోగదారులు సహకరించాలని కోరారు.