ఖమ్మం: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

0చూసినవారు
ఖమ్మం: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఖమ్మం నగరంలోని బుర్హాన్ పురం 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. టౌన్-1 ఏడీఈ సీహెచ్ నాగార్జున విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రాపర్తినగర్, బైపాస్ రోడ్డు, ఓల్డ్ సబ్ జైల్ రోడ్, బుర్హాన్పురం, దొరన్న కాలనీ, రమణగుట్ట ప్రాంతాల్లో ఈ అంతరాయం ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్