ఖమ్మం నగరంలోని మమత రోడ్ సబ్ స్టేషన్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న లైన్ నిర్వహణ పనుల కారణంగా 11 కేవీ మైసమ్మ గుడి ఫీడర్ పరిధిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని టౌన్-2 ఏడీఈ యాదగిరి పేర్కొన్నారు. వీఆర్కే సిల్క్స్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు కరెంట్ కోత విధించబడుతుందని తెలిపారు. విద్యుత్ సిబ్బందికి వినియోగదారులు సహకరించాలని కోరారు.