ఖమ్మం: ఆస్తి వివాదం.. పెద్దమ్మ దారుణ హత్య

11చూసినవారు
ఖమ్మం: ఆస్తి వివాదం.. పెద్దమ్మ దారుణ హత్య
ఖమ్మం నగరంలో గురువారం ఆస్తి వివాదంలో మోటె రాములమ్మ(70) అనే వృద్ధురాలిని ఆమె మరిది కొడుకు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రాములమ్మ కుటుంబానికి స్వగ్రామంలో 27 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై సోదరులతో న్యాయస్థానంలో వివాదం నడుస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. నిందితుడు శేఖర్ పై రౌడీషీట్ ఉందని, అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాములమ్మ మృతదేహాన్ని సర్వజనాసుపత్రి శవాగారానికి తరలించారు.

సంబంధిత పోస్ట్