ఖమ్మం: ఓటు హక్కు పరిరక్షణ బాధ్యత అందరిది

4చూసినవారు
ఖమ్మంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు మాట్లాడుతూ, అర్హులైన ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పినా, ఆ దిశగా సరైన చర్యలు లేవని విమర్శించారు. 1930 తర్వాత పూర్తిస్థాయి కులగణన జరగకపోవడంతో బీసీలకు న్యాయం జరగడం లేదని, కులాల వారీగా జనగణన జరిగితేనే బీసీల అసలు జనాభా వెలుగులోకి వచ్చి, రాజకీయ, సామాజిక హక్కులు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్