ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, రేవంత్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ ప్రజా సమస్యలను విస్మరిస్తోందని పువ్వాడ ఆరోపించారు. ఈ అక్రమ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.