కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎస్టీయూ జిల్లా కార్యదర్శి పటేల్ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం జిల్లా పరిషత్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. నూతన కార్మిక చట్టాలు కార్మికులను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చేలా ఉన్నాయని, వారి హక్కుల రక్షణ కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.