జిల్లాలో సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలు చేతికి వస్తున్న నేపథ్యంలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేసి దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నాయకులతో కలిసి ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వై. విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, ఎస్. నవీన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.