భారత రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సోమవారం రఘునాథపాలెం మండలం మంచుకొండలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మహోన్నతమైనదని ఆయన అభివర్ణించారు. యువత అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమ సమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు.